ఆసీస్‌‌‌‌తో సిరీస్‌‌‌‌లో సత్తా చాటిన యంగ్​స్టర్​ బిష్ణోయ్

ఆసీస్‌‌‌‌తో సిరీస్‌‌‌‌లో సత్తా చాటిన యంగ్​స్టర్​ బిష్ణోయ్
  • టీ20 వరల్డ్ కప్‌‌‌‌ టీమ్‌లో మూడో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ బెర్తుకు పోటీ

(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) : ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌‌‌‌లో టీమిండియా సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. ఐదు మ్యాచ్‌‌‌‌ల్లో నాలుగింటిలో  కంగారూలను ఓడించి వరల్డ్ కప్ ఫైనల్లో ఆ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. చాలా మంది సీనియర్లు ఈ సిరీస్‌‌‌‌కు దూరంగా ఉండగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో యంగ్ క్రికెటర్లతో బరిలోకి దిగిన ఇండియా టీమ్‌‌‌‌లో పలువురు కుర్రాళ్లు సత్తా చాటారు.

సీనియర్లు  లేని టైమ్‌‌‌‌లో తమ టాలెంట్‌‌‌‌ను ప్రూవ్‌‌‌‌ చేసుకున్నారు. వారిలో ముందున్నది లెగ్ స్పిన్నర్, 23 ఏండ్ల రవి బిష్ణోయ్. ఐదు మ్యాచ్‌‌‌‌ల్లో తొమ్మిది వికెట్లతో అతను ప్లేయర్ ఆఫ్​ సిరీస్‌‌‌‌గా నిలిచాడు. ఫామ్ కోల్పోయి టీమ్‌‌‌‌కు దూరమైన సీనియర్ లెగ్  స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌‌‌‌కు తానే సరైన ప్రత్యామ్నాయం అని నిరూపించుకోవడంతో పాటు జట్టు కొత్త అస్త్రంగా మారాడు. వాస్తవానికి ఈ సిరీస్‌‌‌‌కు సీనియర్ చహల్‌‌‌‌ను కాదని బిష్ణోయ్‌‌‌‌ను ఎంపిక చేయడంపై  విమర్శలు వచ్చాయి. వన్డే వరల్డ్ కప్‌‌‌‌లోనూ ఆడించని చహల్‌‌‌‌ను ఈ సిరీస్‌‌‌‌కు తీసుకోకపోవడంపై మాజీలు పెదవి విరిచారు. ఈ క్రమంలో బిష్ణోయ్‌‌‌‌పై చాలా ఒత్తిడి ఏర్పడింది. అయితే, తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో అత్యంత కీలకమైన సిరీస్‌‌‌‌లో యంగ్ స్పిన్నర్ అద్భుతంగా రాణించాడు.

విమర్శలకు తన బంతులతోనే సమాధానం చెప్పాడు. ఇప్పుడు సౌతాఫ్రికా టూర్‌‌‌‌‌‌‌‌లో  టీ20 సిరీస్‌‌‌‌లో పోటీపడే  ఇండియా టీమ్‌‌‌‌లోనూ చహల్‌‌‌‌ను కాదని రవి బిష్ణోయ్‌‌‌‌ను చేర్చడం టీమ్ లాంగ్ టర్మ్ ప్లాన్‌‌‌‌ లో భాగమని సెలెక్టర్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ముఖ్యంగా రాబోయే టీ20 వరల్డ్ కప్‌‌‌‌ను దృష్టిలో ఉంచుకొనే ఆసీస్‌‌‌‌తో పాటు సఫారీలతో సిరీస్‌‌‌‌లో బిష్ణోయ్‌‌‌‌ను తీసుకున్నట్టు అర్థం అవుతోంది. ఆ మెగా ఈవెంట్‌‌‌‌కు ముందు ఇండియాకు మరో ఆరు టీ20లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిష్ణోయ్ ప్రస్తుతానికి 33 ఏండ్ల చహల్ ప్లేస్‌‌‌‌ను భర్తీ చేసినట్టు స్పష్టం అవుతుంది.

గణాంకాల్లో ముందు

అనుభవంలో చహల్ ముందుండగా ప్రతిభలో బిష్ణోయ్ తక్కువేం కాదని అతని గణాంకాలే నిరూపిస్తున్నాయి. చహల్ ఈ ఏడాది తొమ్మిది టీ20 మ్యాచ్‌‌‌‌లు ఆడి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. అదే టైమ్‌‌‌‌లో  బిష్ణోయ్ 11 మ్యాచ్‌‌‌‌ల్లో ఆడి ఏకంగా 18 వికెట్లు పడగొట్టడం చూస్తే చహల్ కంటే తను ఎంత ప్రభావవంతంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా  ఆసీస్‌‌‌‌తో సిరీస్‌‌‌‌లో అతను ఇండియా ప్రధాన బౌలర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. వికెట్లు పడగొట్టడమే  కాకుండా ఏ పరిస్థితుల్లో అయినా బౌలింగ్‌‌‌‌ చేసి జట్టుకు ఉపయోగపడగలనని నిరూపించుకున్నాడు.

వాస్తవానికి ఈ సిరీస్‌‌‌‌లో బిష్ణోయ్‌‌‌‌కు సరైన ఆరంభం లభించలేదు. వైజాగ్‌‌‌‌లో తొలి పోరులో నాలుగు ఓవర్లలో ఏకంగా 54 రన్స్‌‌‌‌ లీక్‌‌‌‌ చేశాడు. ఓ క్యాచ్ డ్రాప్‌‌‌‌, మిస్‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌లు చేసి ఫీల్డింగ్‌‌‌‌లోనూ నిరాశపరిచాడు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా గొప్పగా పుంజుకున్నాడు. తర్వాతి మ్యాచ్‌‌‌‌ల్లో పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఆసీస్‌‌‌‌పై బిష్ణోయ్  వేసిన 20 ఓవర్లలో ఏడు పవర్ ప్లేలోనివే. ఈ ఓవర్లలో అతను 20 డాట్ బాల్స్ వేయడంతో పాటు మంచి (6.45) ఎకానమీ రేట్‌‌‌‌తో ఐదు వికెట్లు తీశాడు. పిచ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌కు అనుకులంగానే ఉన్నప్పటికీ బిష్ణోయ్‌‌‌‌ను బౌలింగ్‌లో తాము ఇబ్బంది పడ్డామని ఆసీస్ కెప్టెన్‌‌‌‌ మాథ్యూ వేడ్ ఒప్పుకోవడం గమనార్హం.

అదే ప్రత్యేకం

చహల్‌‌‌‌తో పోలిస్తే బిష్ణోయ్ బౌలింగ్ భిన్నంగా ఉంటుంది. ఈ యంగ్ స్పిన్నర్ వరుస గూగ్లీలతో వికెట్లు పడగొట్టే ప్రయత్నం చేస్తుంటాడు. అతని బాల్  ఎక్కువ టర్న్‌‌‌‌ కాదు. చహల్ మాదిరిగా వైడ్ ఆఫ్ స్టంప్ బౌలింగ్‌‌‌‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేడు. కానీ, కాస్త వేగంగా బాల్‌‌‌‌ను స్కిడ్ చేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టిస్తున్నాడు. ఇదే ఇతర లెగ్ స్పిన్నర్ల కంటే బిష్ణోయ్‌‌‌‌ను ప్రత్యేకంగా మారుస్తోందని శ్రీలంక  లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డాడు. ‘బిష్ణోయ్ ఇతర లెగ్ స్పిన్నర్ల కంటే భిన్నంగా ఉం టాడు. తను వేగంగా బౌలింగ్ చేస్తాడు.

అలాగే బాల్‌‌‌‌ను చాలా స్లైడ్ చేస్తాడు. బ్యాటింగ్‌‌‌‌కు అనుకూలించే వికెట్లపై అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం’ అని పేర్కొన్నాడు.  ఏదేమైనా సౌతాఫ్రికా టూర్‌‌‌‌‌‌‌‌లో  కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు ఉన్న ఇండియాలో తుది జట్టులో చోటు కోసం కఠిన సవాల్‌ఎదుర్కోనున్నాడు. అయితే, వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌‌‌‌ ముంగిట బిష్ణోయ్ తనకంటూ బలమైన ముద్ర వేసుకున్నాడు. ఆ మెగా టోర్నీలో ఇండియా మూడో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌గా రేసులోకి వచ్చాడు. ఆ టోర్నీ జరిగే వెస్టిండీస్, యూఎస్‌‌‌‌ఏఈలో పిచ్‌‌‌‌లు స్పిన్నర్లకు కొంత సపోర్ట్ చేయొచ్చు. ఈ లెక్కన  ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు ఉండటం ఇండియా టీమ్‌‌‌‌కు ప్లస్‌‌‌‌ పాయింట్ కానుంది.