
చాలామంది ఆఫీస్ ల్యాప్‌టాప్‌లను ప్రతి రోజూ ఇంటికి తెచ్చుకుని, మళ్లీ మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీసుకి పట్టుకెళ్తుంటారు. అలాంటి వాళ్లు ల్యాప్‌టాప్‌ను సేఫ్‌గా క్యారీ చేయడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. ల్యాప్‌టాప్‌ని జాగ్రత్తగా పౌచ్‌లో పెట్టి, దాన్ని బ్యాగులో పెట్టి ఏవో తిప్పలు పడుతుంటారు.
ఇంకొందరైతే ల్యాప్ స్టాండ్‌ని కూడా ఆఫీస్‌కు తీసుకెళ్తారు. అలాంటి వాళ్లకు ఇది బెస్ట్ టూల్. మోఫ్ట్ కంపెనీ టూ ఇన్ వన్ ల్యాప్‌టాప్ స్లీవ్ని తీసుకొచ్చింది. దీన్ని ల్యాప్‌ట్యాప్ స్టాండ్‌లా కూడా వాడుకోవచ్చు. స్క్రాచ్ ఫ్రూఫ్, వాటర్ ఫ్రూఫ్ లెదర్‌తో తయారుచేశారు.
ధర: 5,399 రూపాయలు