సినిమా మేనేజర్​ను బెదిరించి.. అభరణాలను చోరీ చేశారు

హైదరాబాద్​ శ్రీనగర్​ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు సినీ మేనేజర్​ను కిడ్నాప్​ చేయడానికి యత్నించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సినిమా మేనేజర్​ మేడికొండ హరీష్​ శ్రీనగర్​ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కాగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చారు. వారిరువురు మారణాయుధాలు చూపిస్తూ హరీష్​ని చంపేస్తామని బెదిరించారు. అనంతరం అతన్ని బలవంతంగా ఆటోలో కూర్చోబెట్టి ఎస్​ఆర్​నగర్​ వైపు తీసుకెళ్లారు. ఈ క్రమంలో హరీష్​ వారి నుంచి తప్పించుకోవడంతో.. దుండగులు ఇద్దరు అతని బంగారు అభరణాలు, సెల్ ఫోన్లతో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.