![Thiago Messi: మరీ టాలెంటెడ్‌లా ఉన్నాడే: ఒకే మ్యాచ్‌లో 11 గోల్స్ కొట్టిన మెస్సీ కొడుకు](https://static.v6velugu.com/uploads/2025/02/thiago-smashes-11-goals-in-one-game-in-u13-mls-cup-fixture-against-atalanta-united_zrFqtNAMnJ.jpg)
అర్జెంటీనా ఫుట్ బాల్ గ్రేట్ లియోనెల్ మెస్సీ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రస్తుత ఫుట్ బాల్ గేమ్ లో అతనొక సంచలనం. టాప్ ప్లేయర్లలో ఒకడు. తన కెరీర్ లో ఎన్నో గోల్స్ కొట్టిన మెస్సీ అంతకు మించిన ఖ్యాతిని సంపాదించాడు. ఎన్నో అవార్డులతో పాటు ఎన్నో రివార్డులు మెస్సీ సొంతం. రిటైర్మెంట్ ప్రకటించకుండానే దిగ్గజ ఆటగాడిగా పేరు సంపాదించాడు. అతని కొడుకు థియాగో మెస్సీ అతని జాడల్లోనే నడుస్తున్నాడు. 12 సంవత్సరాల వయసులో రికార్డ్స్ బద్దలు కొడుతున్నాడు. అండర్ 13 టోర్నీలో ఏకంగా 11 గోల్స్ కొట్టి ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు.
ఇంటర్ మయామి తరపున అండర్ 13 కప్ లో భాగంగా అట్లాంటా యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో థియాగో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. 11 గోల్స్ కొట్టి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. థియాగో మెస్సీ ధాటికి ఈ మ్యాచ్ లో ఇంటర్ మయామి 12-0 తేడాతో విజయం సాధించింది. 12 గోల్స్ లో 11 గోల్స్ కొట్టి సంచలనంగా మారిన అతను.. ఫస్ట్ హాఫ్ లో ఐదు గోల్స్.. సెకండ్ హాఫ్ లో మరో ఆరు గోల్స్ కొట్టాడు. తన తండ్రిలాగే 10వ నంబర్ జెర్సీ ధరించి మైదానంలో చాలా చురుకుగా కనిపించాడు. ఫస్ట్ హాఫ్ లో హ్యాట్రిక్.. సెకండ్ హాఫ్ లో డబుల్ హ్యాట్రిక్ గోల్స్ చేశాడు.
ALSO READ | SL vs AUS: సెంచరీలతో హోరెత్తిస్తున్న స్మిత్.. ద్రవిడ్ రికార్డ్ సమం
థియాగో ప్రదర్శన చూసిన తర్వాత మెస్సీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే తండ్రి లాగే మరో మెస్సీ అవ్వడం ఖాయం అంటున్నారు. 2012 లో జన్మించిన థియాగోపై భవిష్యత్తులో భారీ అంచనాలున్నాయి. 1987లో అర్జెంటీనాలోని రోసారియోలో జన్మించిన లియోనెల్ మెస్సీ.. క్లబ్, దేశం తరపున ఆడుతూ మొత్తం 850 గోల్స్ చేశాడు. ఫుట్ బాల్ చరిత్రలో ఆరు యూరోపియన్ గోల్డెన్ షూస్ గెలుచుకున్న ఏకైక ఆటగాడు.
Thiago Messi has alone scored 11 goals in one game btw👍 https://t.co/Dton3xAFjo pic.twitter.com/m3bQ8cNhmh
— Chalala💰 (@ChalalaFCB_) February 5, 2025