బిచ్చగాడిలా తిరుగుతూ.. రూ.40 లక్షల విలువైన బంగారం చోరీ

వరంగల్ : చోరీల కోసం దొంగలు వేస్తే ప్లాన్ల గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఎవ్వరికీ చిక్కకుండా మారు వేషాల్లో దొంగతనాలు చేస్తుంటారు. అయితే ఓ దొంగ మాత్రం సినిమాను తలపించేలా బంగారాన్ని చోరీ చేశాడు.  దండుపాళ్యం సినిమాను తలపించేలా చోరీలకు పాల్పడుతున్నాడు. వరంగల్ కు చెందిన పిట్టల వినోద్ అనే వ్యక్తి పగలు బిచ్చగాడిలా సంచరిస్తూ.. రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు 11 ప్రాంతాల్లో చోరీలు చేసిన వినోద్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి, రూ.40 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.