ఎవరికి కనిపించకుండా.. ఎవరి చేతికి దొరక్కుండా దొంగతనం చేయడం అంత ఈజీ కాదు..దానికి కూడా నైపుణ్యం ఉండాల్సిందేనని ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఓ దొంగ ఏకంగా బ్యాంక్ కు కన్నమేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
2024, జనవరి 1వ తేదీ అర్థరాత్రి మండలంలోని దుబ్బాక గ్రామంలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో చోరీ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి బ్యాంక్ తాళం పగలగొట్టి లోపలికి ఎంటరయ్యాడు. ఇంకేముంది.. వెంటనే సైరన్ మోగింది. దీంతో అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది వెంటనే బ్యాంక్ కు తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్యాంక్ వద్దకు చేరుకున్న పోలీసులు లోపల ఉన్న దొంగలను బ్యాంకు బయట తాళం వేసి పట్టుకున్నారు.