అయ్యో పాపం: వైన్ షాపు దగ్గర కారు ఆపి వెళితే.. కేటుగాళ్లు పెద్ద షాక్ ఇచ్చారు..

అయ్యో పాపం: వైన్ షాపు దగ్గర కారు ఆపి వెళితే.. కేటుగాళ్లు పెద్ద షాక్ ఇచ్చారు..

సాయంత్రం పూట కాస్త మందు తాగి రిలాక్స్ అవుదామని.. వైన్ షాపు బయట కారు ఆపి వెళ్లిన వ్యక్తికి పెద్ద షాక్ ఇచ్చారు కేటుగాళ్లు.. కారు పార్క్ చేసి మందు కొనుక్కొని తిరిగొచ్చే గ్యాప్ లో కారు దొంగలించారు కేటుగాళ్ళు. దీంతో మందు తాగకముందే దిమ్మతిరిగిపోయింది కారు యజమానికి.సోమవారం ( మార్చి 17 ) హైదరాబాద్ లోని బేగంపేటలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

మందు తాగి రిలాక్స్ అవుదామని..  బేగంపేటలో ఉన్న రిలాక్స్ వైన్ షాప్ దగ్గరికి వెళ్లాడు ఓ వ్యక్తి. కారులో వచ్చిన అతను.. కారును వైన్ షాప్ బయట పార్క్ చేసి వెళ్ళాడు. మందు కొనుక్కొని తిరిగి తిరిగి వచ్చి చూసేసరికి.. అక్కడ తన కారు లేకపోవడంతో షాక్ అయ్యాడు. తన కారు గురించి వైన్ షాపు సిబ్బందిని అడుగగా.. తమకు సంబంధం లేదని సమాధానం ఇచ్చారు.

Also Read :- ఔరంగజేబు సమాధి తొలగించాలని గొడవ

అప్పటివరకు పార్క్ చేసి ఉన్న తన కారు.. కొద్దిసేపటికే కనిపించకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళాడు సదరు వ్యక్తి. కారును ఎవరో దొంగలించారని గుర్తించిన వ్యక్తి  పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. వైన్ షాపు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.