గరిడేపల్లి: పోలీస్ స్టేషన్ గోడదూకి ఓ దొంగ పారిపోయాడు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఇటీవల మండలంలోని గడ్డిపల్లి, రంగాపురం, వెలిదండ గ్రామాల పరిసరాల పొలాల్లో దాదాపు 50 మోటర్లను దొంగలు ఎత్తుకుపోయారు. దీంతో కొంతమంది రైతులు కాపుగాసి ఓ యువకుడిని పట్టుకొని గురువారం పోలీసులకు అప్పగించారు.
పోలీసులు విచారణ చేసి మరో ఇద్దరిని స్టేషన్ కు తీసుకొని వచ్చారు. శుక్రవారం రాత్రి అందులో ఒక దొంగ టాయిలెట్ కి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి స్టేషన్ గోడదూకి పారిపోయాడు. దొంగను పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు.