దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల ఏటీఎంలు టార్గెట్ గా చేసుకున్న దొంగలు ఇపుడు ఏకంగా బ్యాంకులకే కన్నం పెడుతున్నారు. పక్కా ప్లాన్ తో బ్యాంకుల్లో రాబరీ చేస్తున్నారు. లేటెస్ట్ గా వరంగల్ లోని ఎస్బీఐ బ్యాంకులో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ లో దొంగలు లాకర్లో భద్రపరిచిన బంగారం ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్ తో కిటికీని కట్ చేసి బ్యాంకు లోపలికి ప్రవేశించిన దొంగలు.. సుమారు 10 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితులను గుర్తించేందుకు..సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు.