
కొందరు దొంగలను చూస్తుంటే.. ‘దొంగ లందు వింత దొంగలూ వేరయా’ అని మాట్లాడుకోవాలో ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే చోరీలు చేసే వాళ్లు ఏదైనా వస్తువును దొంగిలిస్తే దానికి ఎంత లాభం వస్తుంది అని చూసి పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటుంటారు. డబ్బు, బంగారం.. ఇలా విలువైన వాటి వెంట పడతారు. కానీ ఈ దొంగ చేసిన పనికి మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లాలో విచితరమైన దొంగ చీరీకి పాల్పడుతూ సీసీ కెమెరాకు చిక్కాడు. రంగశాయిపేట్ బైపాస్ రోడ్డులో ఈ దొంగ పాల్పడని పనికి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒక్కొక్కరు ఇలా ఉన్నారేంట్రా బాబు అనుకుంటున్నారు. ఎండకాలం ప్రజల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రంలో పెట్టిన కుండను దొంగిలించాడు గుర్తు తెలియని వ్యక్తి.
ఆటోలో వచ్చి ఎవరైనా చూస్తున్నారా లేదా అని చెక్ చేసుకుని.. ఎవరూ లేరులే అని కన్ఫమ్ చేసుకున్నాక కుండను అపహరించుకుపోయాడు ఈ విచిత్ర దొంగ. కుంచో దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ కెమెరాల్లో కుండ మాయం చేయడం చూసి షాక్ అయ్యారు స్థానికులు.