నిజామాబాద్ క్రైమ్, వెలుగు : నిజామాబాద్ నగరంలోని తాళం వేసిన పలు దుకాణాల్లో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారు జామున ఒకటో పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ రోడ్ లోని అరుణ ఫ్యాబ్రిక్స్ బట్టల షాపులోకి ప్రవేశించి రూ.3 లక్షలు దొంగలించారు.
డిచ్ పల్లి మండల కేంద్రంలోని హేమ సిల్వర్ మర్చంట్ బంగారు దుకాణంలో సుమారు అరకిలో వెండి ఎత్తుకెళ్లారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.