ఆలయాలే టార్గెట్.. వరుస చోరీలతో రెచ్చిపోతున్న దొంగలు

జగిత్యాల జిల్లాలో దొంగలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఆలయాల్లో వరుసగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వారం రోజుల్లో ఐదు ఆలయాల్లో దొంగలు చోరీ చేయగా... ఈరోజు(సెప్టెంబర్ 03 ఆదివారం) వెల్గటూర్ లోని హనుమాన్ ఆలయంలో హుండీ పగలగొట్టి రూ. 5వేల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆలయ పూజారి తెలిపారు. ఇలా వరుస దొంగతనాలు జరుగుతుండడంతో స్థానికలు భయాందోళనలకు గురవుతున్నారు. 

ఆలయాలే టార్గెట్ గా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకోవడంలో పోలీసుల నిఘా విఫలమైందని స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, క్రైం టీమ్ తో రంగంలోకి దిగి తనిఖీలు చేస్తామని పోలీసులు తెలిపారు.