తాండూరులో వరుస చోరీలు.. 50 తులాలకు పైగా బంగారం చోరీ

తాండూరులో వరుస చోరీలు.. 50 తులాలకు పైగా బంగారం చోరీ

వికారాబాద్ జిల్లా తాండూరులో వరుస చోరీలు కలవర పెడుతున్నాయి. పట్టపగలే దొంగతనాలు చేస్తున్నారు.  లేటెస్గ్ గా  పట్టపగలే  తాండూరులో మరోచోరి జరిగింది. ఓ విలేకరి ఇంట్లో చొరబడిన దుండగులు 15 తులాల బంగారంతో పాటు నగదు  ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూజ్ టీంతో పరిశీలిస్తున్నారు . 

అంతకు ముందు తాండూరు  పట్టణం సాయిపూర్ లోని ఓ ఇంట్లో భారీగా బంగారం చోరీ  జరిగింది.  బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చే వరకు ఇంటికి కన్నం వేశారు దొంగలు. ఇంటి తాళాలు పగలగొట్టి నగదు, 40 తులాల బంగారం ఎత్తుకెళ్ళారు  దుండగులు.   క్లూస్ టీమ్  రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.   దుండగుల కోసం ప్రత్యేకంగా రంగంలో దిగిన పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. 

ఫిబ్రవరి 7న పట్టపగలే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో  చొరబడ్డ దొంగలు 2 తులాల బంగారం,20 తులాల వెండి,30 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇలా వరుస చోరీలతో తాండూరు వాసులు భయాందోళనకు గురవుతున్నారు.