దొంగలు బీభత్సం.. అంత్యక్రియలకు వెళ్లొచ్చేలోపు ఇల్లు గుల్ల

 దొంగలు బీభత్సం..  అంత్యక్రియలకు వెళ్లొచ్చేలోపు ఇల్లు గుల్ల

హయత్నగర్లో దొంగలు రెచ్చిపోయారు. ప్రియదర్శిని కాలనీలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు.  సూర్యాపేటలో అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వచ్చే వరకు ఇల్లు గుల్ల చేశారు.  ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న 35తులాల బంగారు ఆభరణాలు,వెండి వస్తువులు చోరీ చేశారు.  పీఎస్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజయ్ గుల్మార్ లో  గ్యాంగ్ చోరీ జరిగింది.  ఇప్పుడు మరో భారీ చోరీ జరగడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు.  సరైన గస్తీ లేకపోవడమే చోరీకి కారణమని స్థానికుల ఆరోపిస్తు్న్నారు.