వామ్మో దొంగలు.. రిటైర్డ్ ఐఏఎస్ ను వదల్లేదు..

వామ్మో దొంగలు.. రిటైర్డ్ ఐఏఎస్ ను వదల్లేదు..

రంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ జరిగింది. ఈ సారి ఏకంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంటినే కణ్నం వేశారు కేటుగాళ్లు. వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ జాగర్ కార్పొరేషన్ లోని గంధం గూడా విలేజ్ లోని కిష్టారెడ్డి కాలనీ రోడ్డు నెంబర్ 8లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హరి బాబు నివాసం ఉంటున్నారు. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లారు హరిబాబు. ఇదే అదునుగా చూసిన కేటుగాళ్లు ఆయన ఇంటికి కణ్నం వేశారు.   

తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు ఇళ్లు చూడగా తాళాలు పగలగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లారు. సామాను అంతా చిందరవందరగా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు.  సుమారు 10 నుండి 12 గ్రాముల బంగారం తో పాటు ఓ లాప్ టాప్ ను చోరి చేసినట్టు తెలుస్తుంది.