రెచ్చి పోయిన దొంగలు.. మహబూబాబాద్లో ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు చోరీ

రెచ్చి పోయిన దొంగలు.. మహబూబాబాద్లో ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు చోరీ

మహబూబాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలో ఏకంగా ఇంట్లోకి చొరబడి బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం (ఫిబ్రవరి 23) తెల్లవారుజామున ఇంట్లోకి చరబడి నగలు, డబ్బు ఎక్కడ దాచారో చెప్పమని బెదిరించారు. 

ఇంట్లో ఉన్న 10 వేల రూపాయలు బెదిరించి తీసుకున్నారు. అంతటితో నగలు ఎక్కడ ఉన్నాయో చెప్పమని భయపెట్టారు. ఇంట్లో నగలు లేకపోవడంతో మహిళను మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారం చైన్ ను లాక్కెళ్లారు. తెల్లవారు జామున జరిగిన చోరీతో పట్ణణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 

దొంగలు బెదిరించి మూడున్నర తులాల బంగారం, 10 వేల రూపాయలు అపహరించారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.