ఎల్లారెడ్డిపేటలో వైన్ షాపులో దొంగలు పడ్డారు!

ఎల్లారెడ్డిపేట, వెలుగు: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వైన్ షాపులో దొంగలు పడ్డారు. చిదుగు శ్రీనివాస్ అనే వ్యాపారి స్థానిక సెకండ్ బైపాస్​లో శ్రీలక్ష్మీనరసింహ వైన్స్​పేరుతో లిక్కర్​షాపు నిర్వహిస్తున్నాడు. రోజూలాగే బుధవారం రాత్రి 10 గంటలకు షాపు క్లోజ్​చేశాడు.

అయితే అర్ధరాత్రి తర్వాత తాళాలు పగలగొట్టి వైన్​షాపులోకి దొంగలు చొరబడ్డారు. రూ.91వేలు క్యాష్, రూ.29 వేల లిక్కర్​బాటిళ్లను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.