కౌడిపల్లి, వెలుగు: ఆదివారం అర్ధరాత్రి మండల పరిధిలోని తిమ్మాపూర్ లో మూడు ఇండ్లలో దొంగలు పడ్డారు. గ్రామానికి చెందిన ముద్దం శేఖర్ ఇంటి తాళం పగలగొట్టి అల్మారా ధ్వంసం చేసి 25 తులాల వెండి పట్టగొలుసులు, రూ.20వేల నగదు చోరి చేశారు.
ఇదే గ్రామానికి చెందిన వెంకాగౌని నర్సింలు గౌడ్ ఇంటి తాళం పగులగొట్టి రూ.2 వేల నగదు ఎత్తుకె ళ్లారు. ముద్దం మల్లయ్య ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోని వస్తువులు చిందర వందర చేశారు. ఎస్ఐ రంజిత్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. వారం రోజుల్లో ఐదు తాళం వేసిన ఇండ్లలో చోరీ జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.