తాళం వేసి ఉన్న రెండు విల్లాల్లో దొంగల బీభత్సం

తాళం వేసి ఉన్న రెండు విల్లాల్లో దొంగల బీభత్సం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. గత కొన్ని రోజులుగా తాళం వేసి ఉన్న ఇండ్లు టార్గెట్ గా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు విల్లాల్లో 2024 మార్చి 6 బుధవారం దొంగల బీభత్సం సృష్టించారు. సీతారాం హోమ్స్ లోని రెండు విల్లాల్లో 21B & 2B ఇంటి తాళాలు పగల కొట్టి.. 2 తులాల వెండి, రూ. 8వేల నగదుతో పాటు లాకర్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు బాచుపల్లి పోలీసులు.