పట్టపగలే దొంగతనం..చేతిలోని బ్యాగ్ లాక్కెళ్లిన  దుండగులు

  •     బైక్ పై వచ్చి చేతిలోని బ్యాగ్ లాక్కెళ్లిన  దొంగలు 

దమ్మపేట వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో మధ్యాహ్నం ఓ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ. 40 వేల నగదును బైక్ పై వచ్చిన దుండగులు ఎత్తుకెళ్లారు.  పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..  దమ్మపేట మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అంజయ్య సోమవారం బ్యాంకు నుంచి రూ.40 వేలను సైకిల్ పై వెళ్లి తీసుకువస్తున్నాడు.

 బైక్ పై నుంచి దిగడానికి సాయం చేయండని నిందితులు అడగడంతో అంజయ్య సైకిల్ ను పక్కకు ఆపి వస్తుండగా చేతిలో ఉన్న సంచిని లాక్కొని మందలపల్లి వైపు పరారయ్యారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.