ఒకే రోజు మూడు ఆలయాల్లో దొంగలు పడ్డారు

జగిత్యాల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు మూడు ఆలయాల్లో చోరీకి పాల్పడ్డారు. ధర్మపురి మండలం తిమ్మాపూర్ లోని పంచముఖ హనుమాన్, పెద్దమ్మతల్లి, రాయపట్నం గోదావరి ఒడ్డున ఉన్న శివాలయాల్లోని తలుపులు తాళాలు పగలగొట్టి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. 

పంచముఖ హనుమాన్ ఆలయ హుండీలోని రూ. 6 వేలు,రాయపట్నం శివాలయంలో అమ్మవారి తాళిబొట్టు దొంగిలించినట్లు ఆలయ పూజారులు, అధికారులు తెలిపారు. డాగ్ స్క్వాడ్, సీసీ ఫుటేజీ, ఫింగర్ ప్రింట్ సేకరించి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

మంచిర్యాల జిల్లా  దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో చోరీకి యత్నించారు  ఇద్దరు దొంగలు . గుడిలోపల ఉన్న హుండీలు,  ఆలయ ద్వారం గేట్, తాళాలు విరగ్గేట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో వెనుదిరిగిపోయారు. ఈ ఘటన  ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది . పోలీసులు విచారణ చేపట్టారు.