వికారాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం

వికారాబాద్ జిల్లాలో  దొంగలు బీభత్సం

వికారాబాద్ జిల్లాలోని టీచర్స్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు.  ఒకే వీధిలో తాళాలు వేసి ఉన్న ఇళ్ళే టార్గెట్ గా దొంగతనాలు చేశారు.  నాలుగు ఇళ్ళల్లో కలిపి పదివేలు రూపాయలు నగదు చోరీ చేయగా బంగారం విలువ తెలియాల్సి ఉంది. మొదట మెయిన్ తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన దొంగలు.. దానికి సీక్రెట్ లాక్ ఉండటంతో డోర్ తెరుచుకోలేదు. బయటనుంచి కిటికీ వెంటిలేటర్ ను గడ్డపారతో పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు.  ఇంట్లో ఉన్న రెండు బీరువాల డోర్లు పగలగొట్టి నగలు, డబ్బు ఎత్తుకెళ్లారు.. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేశారు.  సీసీ కెమరాల్లో దొంగల కదలికలు రికార్డు అయింది.  వరుస చోరీలతో  కాలనీవాసులు బెంబేలెత్తిపోతున్నారు.  ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చోరీ వివరాలు తెలుసుకుంటున్నారు.  వరుస చోరీలు జరిగిన పోలీసులు ఛేధించలేకపోతున్నారు.  కాలనీలో పోలీసులు గస్తీ పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు  కాలనీవాసులు.