ఇంటికి తాళాలు వేసి ఉంటే చాలు దొంగలు రెచ్చిపోతున్నారు. కన్నుపడితే చాలు లూటీ చేసేస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. వరుసగా ఐదు ఇండ్లల్లో చొరబడ్డారు. స్థానికంగా ఈ ఘటన భయాదోంళనకు గురిచేసింది. గూడూరు మండలం బొల్లెపల్లి గ్రామంలోని ఇండ్లల్లో చోరీకి దింగిన దొంగలు సుమారు 2 లక్షల నగదు, 2 తులల బంగారం.2 ఉంగరాలు దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు గూడూరు పోలీసలుకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. వరుస ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడటంతో బొల్లెపల్లి గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.