శంషాబాద్ లో చైన్ స్నాచింగ్ దొంగలు వీరంగం సృష్టించారు. పొలం పనులు చేస్తున్న మహిళా రైతు మెడలోని గొలుసును ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలలోని హమీదుల్లా నగర్ లో మంజుల అనే రైతు తన వ్యవసాయ భూమి వద్ద పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా కారులో పొలం వద్దకు ఓ దొంగ వచ్చాడు. నెమ్మదిగా మంజూలకు మాయా మాటలు చెప్పడం మొదలుపెట్టి మాటలు కలిపాడు.
ఈ క్రమంలోనే మంజూల దృష్టి మల్లించి చేతులకు గ్లౌస్ వేసుకున్నాడు. పక్క ప్రణాళికతో మహిళపైకి దాడికి దిగాడు. మహిళను ఓ రూంలోకి తోసేసి తన మెడలోని పుస్తెల తాడు (బంగారం)ను లాక్కొని మంజూలను ఓ రూంలో వేసి బయట నుంచి తాళం వేసి పరారయ్యాడు. అప్రమత్తంతో మంజూల బయటకు వచ్చి కారును వెంబడించింది.
కారు చివరి నాలుగు అంకెలను గుర్తుంచుకుంది. 2951 స్విష్ట్ కారుగా మంజూల తెలిపింది. ఘటనపై మంజూల భర్తకు చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్టు సమాచారం.