పని మనుషులుగా చేరి..45 లక్షల డైమండ్ నెక్లెస్ చోరీ..ఉదయాన్నే నిద్రలేచే సరికి పరార్

పని మనుషులుగా చేరి..45 లక్షల డైమండ్ నెక్లెస్ చోరీ..ఉదయాన్నే నిద్రలేచే సరికి పరార్

హైదరాబాద్ : రాజేంద్రనగర్ పరిధి బండ్లగూడలో బీహారీ దొంగలు రెచ్చిపోయారు. మ్యాపిల్ టౌన్ షిప్ విల్లాలో బీహార్ కు చెందిన  దంపతులు డిసెంబర్ 23న   భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి రూ. 45 లక్షల డైమండ్, వెండి, గోల్డ్ నగలతో పాటు రూ. 55 నగదును ఎత్తుకెళ్లారు.

Also Read :- కేసు వాపస్ తీసుకుంటా

నెల రోజుల కిందట పని మనుషులుగా చేరిన బీహార్ కు  చెందిన దంపతులే దొంగతనానికి పాల్పడిన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ఓనర్ కొండల్ రెడ్డి డిసెంబర్ 24న  ఉదయం  నిద్రలేచి చూసేసరికి బీహార్ దంపతులు కనిపించకుండా పరారయ్యారు. సీసీ ఫుటేజ్లో చోరీకి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.