హైదరాబాద్లో షటర్ తెరిచి రూ.30 లక్షలు దోపిడీ.. ముగ్గురు నిందితులు అరెస్ట్​

హైదరాబాద్లో షటర్ తెరిచి రూ.30 లక్షలు దోపిడీ.. ముగ్గురు నిందితులు అరెస్ట్​

హైదరాబాద్ సిటీ/పద్మారావునగర్, వెలుగు: షాప్ షటర్ తెరిచి రూ.30.80 లక్షలు ఎత్తుకెళ్లిన ముగ్గురు సభ్యుల ముఠాను మహాంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ సర్ధార్ సింగ్ తన ఆఫీస్​లో సోమవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన మురళీధర్ మనోహర్ శర్మ, యూపీకి చెందిన చంద్రభాన్ పాటిల్, ఉదయ్ సింగ్ ఆరేండ్ల కింద సిటీకి వచ్చారు. 

వీరు గతంలో సికింద్రాబాద్​ ఏరియాలో టెక్స్​టైల్​బిజినెస్ చేశారు. లాక్​డౌన్​సమయంలో నష్టపోయి దివాళా తీశారు. ఆ తర్వాత చోరీలకు ప్లాన్​వేశారు. అందులో భాగంగానే జనవరి 31న అర్ధరాత్రి ఓల్డ్ బోయిగూడలోని దీపక్ ఇంజినీరింగ్ షాప్ షెటర్ ఓపెన్ చేసి, లాకర్ లోని రూ.30.80 లక్షలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో ఈ ఘటనపై మహాంకాళి పోలీసులు నాలుగు టీమ్స్ గా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. 

సీసీ ఫుటేజీల ఆధారంగా సికింద్రాబాద్​సితార లాడ్జిలో నిందితులను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. రూ.28.62 లక్షల నగదు రికవరీ చేశారు. చోరి జరిగిన మూడు రోజుల్లోనే ముఠాను పట్టుకున్న మహాంకాళి సీఐ పరశురామ్, డిటెక్టివ్ సీఐ ప్రసాద్, ఎస్ఐలు గంగాధర్, శ్రీవర్దన్​తో పాటు మహాంకాళి, మార్కెట్, రాంగోపాల్​పేట సిబ్బందిని ఏసీపీ అభినందించారు.