- 15 తులాల బంగారం, రూ.50 వేల చోరీ
బాల్కొండ, వెలుగు: భీంగల్ మండలంలోని బడా భీంగల్ లో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇండ్లల్లో చొరబడి అందినకాడికి దోచుకెళ్లారు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లిన జంగం ప్రవీణ్, జంగం రాజేశ్వర్ ఇండ్లల్లో బీరువాలను ధ్వంసం చేసి వస్తువులను చిందరవందర చేశారు. ప్రవీణ్ ఇంట్లో 8 తులాల బంగారం, రాజేశ్వర్ ఇంట్లో 7 తులాల బంగారం, 50 వేల నగదు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీమ్ వేలు ముద్రలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.