కాటారం, వెలుగు: ఒంటరిగా ఉన్న ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు మహిళ గొంతు కోసి అడ్డువచ్చిన భర్తను కట్టేసి దోచుకెళ్లిన ఘటన జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బస్వాపూర్‌లో సంచలనం సృష్టించింది. కాటారం ఎస్ఐ అభినవ్ తెలిపిన ప్రకారం.. బస్వాపూర్టోల్ ప్లాజా పక్కన తిరుపతి, స్వర్ణలత దంపతులు కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి మంకీ క్యాప్‌లు ధరించిన దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. టాయిలెట్ కోసమని బయటికి వచ్చిన స్వర్ణలతపై కత్తులతో దాడి చేసి గొంతు గోశారు. అడ్డుకునేందుకు వచ్చిన తిరుపతిని తాళ్లతో కట్టేశారు.
ఇంట్లోని నాలుగున్నర తులాల బంగారంతో పాటు రూ.లక్ష నగదు, బైక్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. గురువారం జిల్లా ఏఎస్పీ బోనాల కిషన్ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. క్లూస్‌టీం, సీసీఎస్ పోలీసులు ఆధారాలు సేకరించారు. గ్రామంలోని సీసీ కెమెరాలు, టవర్డంప్ఆధారంగా దర్యాప్తు చేపడతామని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ఏఎస్పీ బోనాల కిషన్తెలిపారు. ప్రజలు భయాందోళన చెందొద్దని పెట్రోలింగ్నిర్వహిస్తామని సూచించారు. ఆయన వెంట కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి ఉన్నారు.