జనగామలో దొంగల హల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఒకే రోజు ఎనిమిది ఇండ్లలో చోరీ

జనగామ, వెలుగు: జనగామ పట్టణంలో దొంగలు హల్‌‌‌‌‌‌‌‌చల్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. వరుల చోరీలకు పాల్పడుతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజే పట్టణంలోని జ్యోతి నగర్‌‌‌‌‌‌‌‌, బాలాజీనగర్‌‌‌‌‌‌‌‌, వడ్లకొండ రోడ్డులోని ఎనిమిది ఇండ్లలో చోరీలు చేశారు. బాలాజీనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన మీసాల శేఖర్‌‌‌‌‌‌‌‌ నైట్‌‌‌‌‌‌‌‌ డ్యూటీకి వెళ్లగా అతడి ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు రూ. 2.44 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశారు. అదే విధంగా ఇదే కాలనీకి చెందిన గంగం భానుప్రకాశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి గురువారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి నెల్లుట్లలోని అత్తగారింటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం చోరీ జరిగినట్లు గుర్తించారు. మొత్తం రూ. 2.27 లక్షల విలువైన 40 గ్రాముల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనటలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ జరిగిన ఇండ్లను ఏసీపీ కొత్త దేవేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సై రఘుపతి పరిశీలించారు. ఇదిలా ఉండగా జ్యోతినగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన మారోజు సురేశ్‌‌‌‌‌‌‌‌ ఇంట్లో రూ.లక్ష విలువైన వెండి, బంగారు అభరణాలు, వడ్లకొండ రోడ్‌‌‌‌‌‌‌‌లోని మినుగొండ అశోక్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ఇంట్లో కిలోన్నర వెండి, రూ.25 వేలు చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు. వీటితో మరో నాలుగు ఇండ్లలో కూడా విలువైన సామాన్లు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. చోరీ జరిగిన ప్రతి ఇంట్లో మూడు రాళ్లు కనిపిస్తుండడంతో చోరీలకు పాల్పడుతోంది మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ముఠాగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్‌‌‌‌‌‌‌‌గా చోరీలు జరుగుతుండడంతో  ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని ఏసీపీ దేవేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. 


చోరీలు చేస్తున్న ఏడుగురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌


బయ్యారం (మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ అర్బన్‌‌‌‌‌‌‌‌), వెలుగు : చోరీలు చేస్తున్న ఏడుగురు వ్యక్తులను శుక్రవారం మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ చెన్నయ్య వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ పట్టణానికి చెందిన కౌశిక్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఆగుర్తి లోకేశ్‌‌‌‌‌‌‌‌, ధరావత్‌‌‌‌‌‌‌‌ సుధీర్‌‌‌‌‌‌‌‌, ఆగుర్తి పునిత్, మోర్ల సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఎర్రంశెట్టి సాయినాయుడు, గండే శివసాయిలు కలిసి కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నారు. వీరు బయ్యారం, గార్ల, కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు, మండలాల్లోని గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో టీవీలు, ఇన్వర్టర్‌‌‌‌‌‌‌‌ బ్యాటరీలు, కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ వస్తువులు, సౌండ్‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌లు, సెటప్‌‌‌‌‌‌‌‌బాక్స్‌‌‌‌‌‌‌‌లను చోరీ చేసి అమ్ముతున్నారు. శుక్రవారం బయ్యారం శివారులో పోలీసులు వెహికల్స్‌‌‌‌‌‌‌‌ తనిఖీ చేస్తుండగా మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ వైపు నుంచి వస్తున్న వీరిని ఆపి విచారించగా చోరీల విషయం బయటపడింది. వారిని అదుపులోకి తీసుకొని, రూ. 4 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ రమణబాబు, సీఐ బాలాజీ, ఎస్సైలు రమాదేవి, వెంకన్న పాల్గొన్నారు.