కేవలం నాలుగు నిమిషాల్లో చోరీ.. ఎస్బీఐ ఏటీఎం పగలగొట్టి..రూ.30లక్షలతో పరారీ

కేవలం నాలుగు నిమిషాల్లో చోరీ.. ఎస్బీఐ ఏటీఎం పగలగొట్టి..రూ.30లక్షలతో పరారీ

రంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. మహేశ్వరం మండలం రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం పగలగొట్టి చోరీ చేశారు దొంగలు. కారులో  వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు సీసీకెమెరాలు, సైరన్ ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. కేవలం నాలుగు నిమిషాల్లోనే ఏటీఎం పగలగొట్టి డబ్బును తీసుకొని పారిపోయారు.  

ఆదివారం (మార్చి 2) తెల్లవారు జామున రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఎస్ బీఐ ఏటీఎంలో చోరీ చేశారు దొంగలు. ముందుగా సీసీ కెమరాలకు స్ర్పేకొట్టి , ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. కట్టర్, ఇనుప రాడ్లతో ఏటీఎంను బద్దలు కొట్టారు. కేవల నాలుగు నిమిషాల్లోనే డబ్బులతో పారిపోయాయి. రెండు రోజుల క్రితం ఏటీఎం రూ. 30లక్షలు పెట్టినట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు. 

ఘటనాస్థలానికి చేరుకున్న మహేశ్వరం డీసీసీ సునితారెడ్డి, ఏసీసీ రాజు ఏటీఎంను పరిశీలించారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి దొంగలకోసం  గాలిస్తున్నారు.