యాదాద్రి, వెలుగు : గుడిలోని హుండీలను పగులకొట్టి చోరీకి పాల్పడిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. భువనగిరి రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ పూజలు నిర్వహించిన అనంతరం బుధవారం సాయంత్రం గుడికి తాళం వేసి వెళ్లిపోయాడు. రాత్రి సమయంలో దుండగులు టెంపుల్పశ్చిమ ద్వారం తాళాలు పగులకొట్టి లోనికి ప్రవేశించారు.
హుండీని పగులకొట్టి అందులో నెలరోజులుగా భక్తులు వేసిన కానుకలను దొంగిలించారు. అనుబంధ హనుమాన్ టెంపుల్లోని హుండీతోపాటు స్టోర్రూంలోని చిన్న హుండీలను పగలకొట్టి నగదు ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం అటెండర్ బత్తిని వెంకటేశం గుడికి వచ్చి చూడగా..
తాళాలు, హుండీలు పగులకొట్టి ఉన్న విషయాన్ని గమనించి పూజారి పవన్కుమార్శర్మకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. గుడికి వచ్చిన పూజారి వెంటనే గ్రామ పెద్దలకు దొంగతనం జరిగిన విషయాన్ని వివరించాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.