నల్లగొండ జిల్లా కేంద్రంలో దొంగల ముఠా హల్ చల్ చేసింది. ఏప్రిల్ 11వ తేదీ రాత్రి మిర్యాలగూడ రోడ్ లోని లక్ష్మి నివాస్ అపార్ట్మెంట్, బృందావన కాలనీ, విశ్వనాధ కాలనీలలో నలుగురు సభ్యుల దొంగల ముఠా సంచరించింది. లక్ష్మి నివాస్ అపార్ట్మెంట్ లో కమ్యూనిటీ హాల్, G8 ఫ్లాట్ ల తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు కేటుగాళ్లు.
నాలుగు ఇళ్లకు బయటనుండి తాళాలు పెట్టీ దొంగతనం చేశారు. పక్కనే ఉన్న రెండు కాలనీల్లో రెక్కి చేసి.. మరణ ఆయుధాలతో సంచరిస్తున్నారు దొంగల ముఠా. అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు రికార్డైంది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.