SBI ఏటీఎంకు నిప్పు.. రూ. 7 లక్షలు బూడిద పాలు

SBI ఏటీఎంకు నిప్పు.. రూ. 7 లక్షలు బూడిద పాలు

టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ రోజురోజుకు దొంగతనాలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రతీ రోజు ఏదో ఒక ఏరియాలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి.  రంగారెడ్డి జిల్లా  మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లిమేట్స్ లో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. మధుబన్ కాలనీ దగ్గర ఎస్బీఐ ఏటీఎంలోకి  ముఠా సభ్యులు చోరబడ్డారు. ఏటీఎం పగళగొట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన దొంగలు ఓపెన్ కాకపోవడంతో  పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు దుండగులు.  ఏటీఎం మిషన్ , 7 లక్షల కరెన్సీ నోట్లు మంటల్లో కాలి బూడిద అయ్యాయి. ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మైలార్ దేవ్ పల్లి పోలీసులు. స్థానికంగా ఉన్న సిసి టీవి ఫూటేజ్ ను పరిశీలిస్తున్నారు. 

ఏటీఎం దొంగలు ఎక్కువగా  జనావాసాలు తిరగని ప్రాంతాల్లో  చోరీకి స్కెచ్ వేస్తున్నారు. మార్చి 2న  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో రావిర్యాల ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు 30 లక్షలు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే.. సీసీ కెమెరాలకు దీని కోసం పోలీసులు మూడు బృందాలుగా దొంగల కోసం గాలిస్తున్నారు.  దొంగలు అరంఘర్ వైపు వెళ్ళినట్లు గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. పోలీసులకు ఈ కేసు సవాల్ గా మారింది.