
కరీంనగర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో 80 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు ఇంట్లో ఉన్న వాళ్లపై కత్తులతో దాడి చేశారు.హుజరాబాద్ లో ఫిబ్రవరి 23 న రాత్రి ప్రతాప రాఘవరెడ్డి ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు.
ఇంట్లో ఉన్న వ్యక్తులపై కత్తులతో దాడి చేసి 80 తులాల బంగారంతో పాటు రూ.7 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
దొంగలు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పరిశీలించగా దొంగలు దోపిడికి ముందు నీళ్ల మోటార్ ఆన్ చేశారు. ట్యాంక్ ఓవర్ ఫ్లో కావడంతో కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు.