కూకట్ పల్లిలో భారీ చోరీ.. 80 తులాల బంగారం, 2 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

కూకట్ పల్లిలోని జయనగర్ లో భారీ చోరీ జరిగింది. నవంబర్ 28న రాత్రి  ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టిన  దొంగలు..బీరువా తాళం ఇరగ్గొట్టి 80 తులాల బంగారం, 2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   అంతరాష్ట్ర దొంగల ముఠా పనా?  లేక ఎవరు చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

కూకట్ పల్లి డివిజన్లో ఈ మధ్యకాలంలో సరైన పెట్రోలింగ్ లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.   గతంలో సమయానికి పెట్రోలింగ్ వాళ్ళు వచ్చే వాళ్ళని ఈ మధ్యకాలంలో పెట్రోలింగ్ అనేది కనబడలేదని చెబుతున్నారు.  ఈ మధ్య కాలంలో చాలా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని..అయితే ఆలస్యంగా  వెలుగులోకి రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా సమాచారం ఇవ్వడం వెనక మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  ఇలాంటి సంఘటనలు జరగకుండా  పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.