రూ.10 లక్షల విలువైన సిగరెట్లు చోరీ

రూ.10 లక్షల విలువైన సిగరెట్లు చోరీ

కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిగరెట్ల ఏజెన్సీలో  రూ.10 లక్షల విలువైన సిగరెట్లను  దొంగలు చోరీ చేశారు. గంజు మార్కెట్లోని  శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్​లో గురువారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఎనిమిది సిగరెట్ కార్టన్లను ఎత్తుకుపోయారు. షాపుకు వేసిన 2  గేట్ల తాళాలు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు.

నలుగురు దొంగలు కారులో వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఘటన స్థలాన్ని డీఎస్పీ నాగేశ్వర్​రావు,  టౌన్​ సీఐ చంద్రశేఖర్​రెడ్డి, సీసీఎస్​ పోలీసులు పరిశీలించారు.  ఓనరు శశిధర్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దొంగల ఆచూకీ కోసం 2 టీమ్స్ ఏర్పాటు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.