
హైదరాబాద్ లో దొంగలు బరితెగిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. ఇళ్లు, ఆఫీసులు, బ్యాంకులే కాకుండా ఆలయాలలో కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు.
తాజాగా మేడ్చల్ లో కట్టమైసమ్మ ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం (ఫిబ్రవరి 28) తుమ్మచెరువు కట్టమైసమ్మ ఆలయంలో చోరీకి పాల్పడిట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అర్ధరాత్రి ప్రాంతంలో తాళాలు పగలగొట్టి గర్భ గుడిలోకి చొరబడి అమ్మవారి విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
ALSO READ : మామునూర్ ఎయిర్ పోర్ట్ వద్ద ’క్రెడిట్’ ఫైట్.. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట
అమ్మవారి మెడలో బంగారు పుస్తెల తాడు, ముక్కు పుడక, వెండి మట్టెలు ఎత్తుకెళ్లారు. వీటితో పాటు ఆలయ వార్షికోత్సవానికి విరాళంగా వచ్చిన రూ.10వేల నగదు, ఆహుజ ఆంప్లిఫయిర్ ఎత్తుకెళ్లినట్లు ఆలయ పూజారులు తెలిపారు.