తాళం వేసి ఉన్న 6 ఇండ్లలో దొంగతనం

 తాళం వేసి ఉన్న 6 ఇండ్లలో దొంగతనం

ఘట్​కేసర్, వెలుగు: తాళం వేసి ఉన్న ఆరు ఇండ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఘట్​కేసర్ మున్సిపాలిటీ  అవుశాపూర్​లోని జగత్ స్వప్న వెంచర్​లో రాజేంద్ర ప్రసాద్ నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజుల కిందట కుటుంబసభ్యులతో కలిసి వేములవాడకు వెళ్లాడు. సోమవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని తులంన్నర బంగారం, రూ.10 వేల నగదు కన్పించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో మల్కాజ్ గిరి ఏసీపీ చక్రపాణి, స్థానిక సీఐ పరుశురామ్​ఘటనాస్థలాన్ని పరిశీలించారు.  పక్కనే ఉన్న అంజలి, థామస్, రవి, అనంతన్, శైలు ఇండ్లలోనూ చోరీ జరిగినట్లు గుర్తించారు. వీరి ఇండ్లలో ఏమీ లభించకపోవడంతో దొంగలు వస్తువులను చిందరవందరగా పడేసి వెళ్లారు. సీసీ పుటేజీలను పరిశీలించగా, ఇద్దరు దుండగులు ముఖాలకు మాస్క్​లు ధరించి, దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్​ను రప్పించి, ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.