నిద్రిస్తున్న మహిళ మెడలోంచి పుస్తెలతాడు చోరీ.

చౌటుప్పల్, వెలుగు: ఇంటి వరండాలో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి దొంగలు పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. ఈ  ఘటన చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.  పోలీసుల వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం మసీదు గూడెం గ్రామానికి చెందిన పిసాటి నర్సిరెడ్డి అతడి భార్య సులోచన ఇంటి వరండాలో నిద్రిస్తున్నారు.

అర్ధరాత్రి సమయంలో దొంగలు గోడ దూకి సులోచన మెడలోని నాలుగున్నర తులాల పుస్తెల తాడును లాక్కొని పారిపోయారు. మహిళ మెడకు గాయాలయ్యాయి. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.