దొరకొద్దనీ సీసీ టీవీలనే ఎత్తుకెళ్లారు.. చివరికి ఏమైందంటే

దొరకొద్దనీ సీసీ టీవీలనే ఎత్తుకెళ్లారు.. చివరికి ఏమైందంటే
  • అరగంటలోనే మూడు షాపుల్లో చోరీ
  • రూ.3.30 లక్షల నగదు, టీవీ, సీసీ పుటేజ్ లను ఎత్తుకెళ్లారు  
  • నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టౌన్ లో ఘటన

ఆర్మూర్, వెలుగు : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టౌన్​ లో దొంగలు వరుస చోరీకి పాల్పడ్డారు. టౌన్​లోని మెయిన్ రోడ్డు లోని మూడు షాపుల తాళాలు పగులగొట్టి రూ.3.30 లక్షల నగదు, టీవీ, సీసీ పుటేజీలను ఎత్తుకెళ్లారు. 

పోలీసులు తెలిపిన ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల మధ్యన ట్రాలీ వెహికల్( ఎంహెచ్04 బీడీ 2763  )లో ఆరుగురు దొంగలు వచ్చారు. ముందుగా దీపక్​ సీటీ స్కాన్​షాపులోని టీవీ ఎత్తుకెళ్లారు. సమీపంలోని దోండి మెడికల్​షాపు కౌంటర్​ లోని రూ.3లక్షలు, హెల్త్​ కేర్ మెడికల్​షాపులో రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు. 

అరగంట వ్యవధిలోనే  మూడు షాపుల్లో దొంగలు దర్జాగా నిజామాబాద్ రూట్​లో వెళ్లిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో ఆర్మూర్ సీఐ సత్యనారాయణగౌడ్ చోరీ షాపులను పరిశీలించారు. రెండు టీమ్ లతో ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.