జవహర్ నగర్, కీసర వెలుగు: రెండు ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోయారు. మహిళల మెడలోంచి గొలుసులను లాక్కెళ్లారు. పోలీసులు తెలిపిన ప్రకారం..జవహర్ నగర్ ఎల్లారెడ్డిగూడ తాళ్లబావికి చెందిన వృద్ధురాలు సాయమ్మ కీసర మండలం రాయరావుపేటలోని తన కూతురు వద్దకు వెళ్లి వస్తుండగా ఆదివారం బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు.
బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయమ్మ ఫిర్యాదుతో జవహర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. అదేవిధంగా కీసర లో ని సీడ్స్ షాప్లో పనిచేసే ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు దొంగలు ఆమె మెడలోని 6 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.