పండుగనాడు నీళ్లివ్వలేదని రోడ్డెక్కిన గ్రామస్తులు

తుంగతుర్తి, వెలుగు : సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో పండుగనాడు కూడా నీళ్లివ్వడం లేదని గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు.  గ్రామస్తుల కథనం ప్రకారం...పదిరోజులుగా గ్రామానికి మంచినీళ్లు రావడం లేదు. ఉగాది రోజు కూడా చుక్క నీరు రాకపోవడంతో ఆగ్రహంతో జనగాం–సూర్యాపేట హైవేపై గంటకు పైగా రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో జాజిరెడ్డిగూడెం పోలీసులు, గ్రామ స్పెషల్ ఆఫీసర్ శశిధర్ రెడ్డి వచ్చి క్రమం తప్పకుండా మంచినీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు.