కలియుగ వైకుంఠం తిరుమలలో అన్యమత ప్రచారం కలకలం రేపింది.. అధికారులు ఎక్కడిక్కడ పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నప్పటికీ తరచూ కొండపై అన్యమత ప్రచారం భక్తులను కలవరపెడుతోంది. తాజాగా మరోసారి తిరుమలపై అన్యమత ప్రచారం వెలుగులోకి వచ్చింది. కొండపై ఉన్న దుకాణాల్లో అన్యమత గుర్తు, పేరు కలిగి ఉన్న వస్తువులను విక్రయించటం కలకలం రేపింది. సీఆర్వో ఎదురుగా ఉన్న దుకాణంలో అన్యమత గుర్తు, పేరు ఉన్న స్టీల్ కడియం అమ్ముతున్నట్లు గుర్తించారు అధికారులు.
హైదరాబాద్ కి చెందిన భక్తులు సదరు దుకాణంలో స్టీల్ కడియం కొని రూమ్ కి వెళ్లి చేసుకోగా కడియంపై ఏసుక్రీస్తు పేరు, గుర్తులు ఉండటం చూసి ఖంగుతిన్నారు. వెంటనే ఈ ఘటనను టిటిడి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన భక్తుడు. ఘటనపై విచారణ జరపాలని టిటిడి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు చైర్మెన్.
ALSO READ : టూరిజం, ట్రావెల్స్ ప్యాకేజీపై..తిరుమల దర్శనాలు రద్దు
హిందూ సమాజం ఎంతో పవిత్రంగా భావించే కలియుగ వైకుంఠం తిరుమలలో అన్యమత ప్రచారం జరగటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. ఈ ఘటనకు బాద్యులైన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు.