ఇస్లామాబాద్: ఇండియాతో వాణిజ్యపరమైన సంబంధాలు పునరుద్ధరించేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ఆలోచిస్తున్నదని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ తెలిపారు. 2019, ఆగస్టు నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు నిలిచిపోయాయని చెప్పారు. బ్రస్సెల్‌లో నిర్వహించిన న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇషాక్ మాట్లాడారు.
‘‘ఇండియాతో వ్యాపారపరమైన సంబంధాలు మళ్లీ ప్రారంభించాలని పాకిస్తాన్‌కు చెందిన ప్రతి వ్యాపారవేత్త కోరుకుంటున్నాడు. ఈ విషయమై మా ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నది. ఇండియా విషయంలో పాకిస్తాన్ దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇండియాతో పాకిస్తాన్ వాణిజ్య సంబంధాలు తెంచుకున్నది. ఆర్టికల్ 370 రద్దును ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేసింది.