తిరగబడరా స్వామి కలెక్షన్స్ పెరుగుతున్నయ్: డైరెక్టర్ రవికుమార్ చౌదరి

రాజ్ తరుణ్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం  ‘తిరగబడర సామీ’. మాల్వి మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్స్.   శుక్రవారం విడుదలైన సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు శనివారం  ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు.

 డైరెక్టర్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ ‘ఆదరిస్తున్న  తెలుగు ప్రేక్షకులకు హ్యాట్సాప్.  రోజు రోజుకి  కలెక్షన్స్ పెరుగుతున్నాయి.  మంచి సినిమాని ఏదీ అడ్డుకోలేదని ఆడియన్స్ నిరూపించారు’ అని చెప్పాడు. ఈ సక్సెస్‌‌‌‌లో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు హీరోయిన్స్. నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ‘200 థియేటర్స్‌‌‌‌లో విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో మరిన్ని థియేటర్స్ పెరిగాయి. సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీమ్ అంతా పాల్గొన్నారు.