తిరగబడర సామీ నుండి చిన్నారి మల్లెతీగ సాంగ్ రిలీజ్

తిరగబడర సామీ నుండి చిన్నారి మల్లెతీగ సాంగ్ రిలీజ్

రాజ్ తరుణ్(Raj Tharun), మాల్వీ మల్హోత్రా(Malvi Malhotra) జంటగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి(AS Ravikumar Chaudary) దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్  నిర్మించిన చిత్రం ‘తిరగబడర సామీ(Thiragabadara Swamy)’.  ఫిబ్రవరి 23న సినిమా విడుదల కానుంది. శుక్రవారం ఈ మూవీ నుంచి సెలబ్రేషన్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘చిన్నారి మల్లెతీగ చామంతి పువ్వులా  ఉంది.. సిగ్గురే బుగ్గపైన చక్కాని చుక్క బాగుంది’ అంటూ సాగిన పాటలో రాజ్ తరుణ్, మాల్వీ ట్రెడిషనల్‌‌‌‌ లుక్‌‌‌‌లో ఆకట్టుకున్నారు. 

జేబీ (జీవన్ బాబు) కంపోజ్ చేసిన ఈ పాటను లిప్సికా భాష్యం, అదితి బావరాజు, చైతు సత్సంగి పాడారు. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్  ఆకర్షణగా నిలిచాయి. మన్నారా చోప్రా మరో హీరోయిన్‌‌‌‌గా నటించగా, మకరంద్ దేశ్‌‌‌‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వీ, ప్రగతి, రాజా రవీంద్ర ఇతర పాత్రలు పోషించారు. భాష్యశ్రీ ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నాడు.