చైనాలో బీభత్సం సృష్టిస్తున్న హెచ్‌ఎంపీవీ(HMPV) వైరస్.. మన దేశంలోనూ విధ్వంసం సృష్టించేలా కనిపిస్తోంది. ఒక్కొక్కటిగా HMPV వైరస్ కేసులు భారత్‌లో బయటపడుతున్నాయి. కర్నాటకలో రెండు కేసుల తర్వాత.. గుజరాత్ రాష్ట్రంలో 2 నెలల చిన్నారికి HMPV వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్(ICMR) నిర్థారించింది. ప్రస్తుతం ఈ చిన్నారి చంద్ ఖేడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. చిన్నారికి ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ చిన్నారి కుటుంబం.. రాజస్థాన్ రాష్ట్రం దుంగాపూర్ నుంచి అహ్మదాబాద్ వచ్చింది.
ALSO READ | వైరస్ వార్తలతో.. స్టాక్ మార్కెట్ ఢమాల్.. 8 లక్షల కోట్ల సంపద ఆవిరి
అంతకుముందు బెంగుళూరులో HMPV కేసులు రెండు వెలుగు చూశాయి. బెంగళూరుకు చెందిన 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీరిలో మూడు నెలల శిశువు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ఎనిమిది నెలల పాప ప్రస్తుతం చికిత్స పొందుతోంది. తదుపరి పరీక్షల కోసం ఈ చిన్నారుల శాంపిల్స్ ను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIV)కి పంపినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఆ రిపోర్ట్ ఆధారంగా భారత్‌లో బయటపడిన వైరస్.. చైనాలో ప్రబలిస్తోన్న వేరియంట్ ఒకటేనా..! కాదా..! అనే నిర్ధారణకు రానున్నారు.