రెండ్రోజుల్లో మూడో ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌.. ఐదుగురు టెర్రరిస్టులు హతం.. ఇద్దరు జవాన్లు మృతి

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో గడిచిన రెండు రోజుల్లోనే మూడు ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లు జరిగాయి. మూడు వేరువేరు చోట్ల భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. బారాముల్లా జిల్లా చక్ తాపర్ లోని ఓ స్కూల్ లో టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారం అందుకున్న  బలగాలు శుక్రవారం అర్ధరాత్రి సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా జరిగిన ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. శుక్రవారం జరిగిన ఓ ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. మరో ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. కాగా, ప్రధాని పర్యటన వేళ కాశ్మీర్ లో ఈ ఎన్ కౌంటర్లు కలకలం సృష్టించాయి.