- కామారెడ్డి జిల్లా లో 17,533 మందికి లబ్ధి
కామారెడ్డి, వెలుగు : మూడో విడత రుణ మాఫీ ప్రభుత్వం గురువారం చేపట్టింది. మూడో విడతలో కామారెడ్డి జిల్లాలో 17,543 మంది రైతులకు రూ. 212 కోట్ల 52 లక్షల రుణ మాఫీ జరిగింది. రైతుల అకౌంట్లలో పైసలు జమకానున్నాయి. రూ. 2 లక్ష ల లోపు రుణ మాఫీ చేశారు. మొత్తం జిల్లాలో ఇప్పటి వరకు 91,899 మంది రైతులకు సంబంధించి రూ. 655 కోట్ల 37 లక్షల రుణ మాఫీ జరిగింది. ఫస్ట్ విడతలో రూ. లక్ష లోపు 49,540 మంది రైతులకు రూ. 231 కోట్ల 13లక్షలు, రెండో విడత లో 24,816 మంది రైతులకు రూ. 211 కోట్ల 72 లక్షల రుణ మాఫీ చేశారు.
నిజామాబాద్లో రూ.190.33 కోట్లు
నిజామాబాద్ : గవర్నమెంట్ గురువారం మూడవ విడత చేసిన రుణమాఫీలో జిల్లాకు చెందిన 11,411 మంది రైతులకు రూ.190.33 కోట్ల లబ్ది చేకూరింది. రూ.2 లక్షల వరకు పంట రుణాలున్న 15,724 బ్యాంకు ఖాతాలకు ఈ సొమ్ము ట్రాన్స్ఫర్ కానుంది. రూ.లక్షన్నర విలువ రుణాలున్న 22,868 ఖాతాలకు రెండవ విడతలో రూ.210.54 కోట్లు బదిలీ చేసింది. మొదటి విడతలో 44,469 మంది రైతులకు రూ.లక్షలోపు పంట రుణాలు రూ.225.62 కోట్లు మాఫీ అయ్యాయి. మొత్తం మూడు విడతలు కలిపి జిల్లాలో 83,061మంది రైతుల ఖాతాలకు మొత్తం రూ.626.49 కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యాయి.