అల్లరి నరేష్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బచ్చలమల్లి’. అమృత అయ్యర్ హీరోయిన్. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది. గురువారం ఈ చిత్రం నుంచి మూడో పాటను విడుదల చేశారు మేకర్స్. ఎమోషనల్‌గా సాగిన ఈ సాంగ్‌లో నరేష్ పాత్రను పాట ద్వారా పరిచయం చేయడం ఆకట్టుకుంది. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన ఈ పాటకు పూర్ణాచారి ఇన్‌స్పైరింగ్ లిరిక్స్ రాయగా, సాయి విఘ్నేష్ పాడిన విధానం ఇంప్రెస్ చేస్తుంది.
‘మరీ అంత కోపం కానే కాదు అలంకారం.. నిజమో అబద్దమో అయినదంటే బతుకు శూన్యం.. అందర్నీ కంది కాలమే.. అమ్మల్లే తానూ సాక్ష్యమే.. అహం ఉన్న దేహం దాటలేదు అంధకారం.. వేదాంతమేమీ లేదు రా.. నీలోని నిన్నే అడగరా.. చరితే ఓ పాఠము.. గతమో గుణపాఠము’ అంటూ ఎమోషనల్‌గా సాగిన పాట సినిమాపై ఆసక్తిని పెంచింది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు.